Kadaknath

కడక్‌నాథ్ ను కాల్ మాసి అని కూడా పిలుస్తారు, దీని మాంసం నల్లగా ఉండటం వలన ఇది దేశీయ జాతి. ఇవి మధ్యప్రదేశ్ లోని ధార్ మరియు జాబువా,ఛత్తీస్గఢ్ లోని బస్తర్,గుజరాత్ మరియు రాజస్థాన్ పరిసర జిల్లాల నుండి 800 చదరపు మైళ్ళు విస్తరించి ఉన్నాయి. ఇవి ఎక్కువగా గ్రామీణ పేదలు, గిరిజనులు మరియు ఆదివాసులు పెంచుతారు. కడకనాథ్ పవిత్రంగా పరిగణిస్తారు దీపావళి తరువాత దీనిని దేవికి బలి ఇస్తారు. ఈ జాతిలో మూడు రకాలు ఉన్నాయి; జెట్ బ్లాక్, గోల్డెన్ మరియు పెన్సిల్. ఇతర కోడి జాతులలో 13-25% కొవ్వు పదార్థం ఉంటుంది. కడకనాథ్ మాంసం 0.73–1.03% కొవ్వు పదార్ధం కలిగి ఉంది.

కడక్‌నాథ్‌ కోడి మాంసంలో ‘మెలనిన్‌' అనే పిగ్మెంట్‌ ఉండటం వల్లే దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. అయితే రంగు ఎలా ఉన్నా దీని మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని తింటే జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు . పైగా ఈ దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు కడక్‌నాథ్‌ కోడి మాంసాన్ని హోమియోపతిలో నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కూడా కడక్‌నాథ్‌ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, మూలికావైద్యంలో ఉపయోగిస్తారు.
   
కడక్‌నాథ్‌ కోడి మాంసంలో పోషకాలు ఔషధ గుణాలు
దీని కోడి మాంసంలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి. బాయిలర్‌ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్‌ కోడిలో కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ, పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షి యం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ నికోటినిక్‌ ఆసిడ్స్‌ ఉంటాయి. కడక్ నాథ్ కోడి మాంసంలోని ఔషధ గుణాలపై సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్ (CSIR - Central Food Technological Research Institute)
‌వారు ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఈ కోడి మాంసంగుండె జబ్బులు ఉన్నవారికి  మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుందట. వయాగ్రాలోని సిల్డెనాఫిల్‌ సిట్రిక్‌ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్‌ సామర్థ్యం పెంచుతుంది. అదే గుణం ఈ మాంసానికి, రక్తానికి ఉందంటారు. మెలనిన్ అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండటం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు.

Kadaknath Chicken Health & Taste Benefits
#KadaknathChicken #KadaknathFarming #KadaknathHen #KadaknathEggs #KadaknathChicks
#JCFarms #DesiChicken #KadaknathChickenSrikakulam #KadaknathSrikakulam

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి